RWF Recruitment 2021: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే RWF Recruitment 2021 | రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. భారతీయ రైల్వే మాత్రమే కాదు... రైల్వేకు చెందిన ఇతర సంస్థలు కూడా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంటాయి. బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 192 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://rwf.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫార్మాట్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. RWF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే... మొత్తం ఖాళీలు- 192 ఫిట్టర్- 85 మెషినిస...